మహారాష్ట్రలో మహాయతి హవా నడుస్తోంది : ప్రధాని మోడీ

-

మహారాష్ట్రలో మహాయతి కూటమికి అనుకూలంగా హవా అనుకూలంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. నాందేడ్ లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. బీజేపీ, మిత్ర పక్షాలు ఇందుకోసం శ్రమిస్తున్నాయి. అందుకే ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికే ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని చూస్తోందని.. కానీ దానిని పునరుద్దరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. 

 

రాష్ట్రంలోని ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి అవినీతి మయంగా మారిందనిn ఆరోపించారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పర్యాయపదంగా ఉందని అభివర్ణించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని, కోర్టును గానీ, దేశ మనోభావాలను పట్టించుకోవడం లేదన్నారు. ‘నవంబర్ 9 తేదీ చారిత్రాత్మకమైంది. ఎందుకంటే 2019లో ఇదే రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం రామాలయం  పై తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత అన్ని మతాలకు చెందిన ప్రజలు
ఎంతో సున్నితత్వాన్ని ప్రదర్శించారు’ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news