పెళ్లి అనేది ఇరు వర్గాల నమ్మకం మీద ఆధార పడుతుంది. పెళ్లి జరిగేకంటే ముందే వధూవరులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. దీంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అయితే ఎవరైనా ఒకరు తమ గురించిన ముఖ్యమైన వివరాలను దాచేస్తే పెళ్లయ్యాక ఆ వివరాలు జీవిత భాగస్వామికి తెలిస్తే అప్పుడు ఆ బంధం నిలబడదు. అక్కడ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్‌లో ఉన్న శాస్త్రి నగర్‌కు చెందిన యువకుడికి, పంకి ఏరియాకు చెందిన మహిళకు ఏప్రిల్ 28వ తేదీన వివాహం జరిగింది. అయితే పెళ్లయిన తరువాత మహిళ తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పింది. దీంతో వారి కాపురం జరగలేదు. అయితే ఆమెపై అనుమానం వచ్చిన భర్త ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. దీంతో అసలు విషయం బయట పడింది.
సదరు మహిళ మహిళ కాదని, హిజ్రా అని తేలింది. దీంతో అగ్గి మీద గుగ్గిలం అయిన భర్త వెంటనే సదరు మహిళతోపాటు తనకు మోసం చేసి ఆమెను కట్టబెట్టినందుకు ఆమె తల్లిదండ్రులు, సోదరులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె జననావయవాలు ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందలేదని, ఆమె హిజ్రా అని, తనను నమ్మించి మోసం చేశారని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.