ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటనవేలు.. ఆ కంపెనీ లైసెన్స్‌ రద్దు

-

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కోన్‌ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు వచ్చిన ఘటనలో ఆ ఐస్‌క్రీమ్‌ తయారీదారు లైసెన్సు రద్దయింది. ఈ నెల 12వ తేదీన ముంబయిలో మలద్‌ ప్రాంతానికి చెందిన బ్రెండన్‌ ఫిర్రావ్ అనే వైద్యుడు ఆన్‌లైన్‌లో యమ్మో కంపెనీకి చెందిన కోన్‌ ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ చేసి తింటుండగా గట్టిగా ఉన్న ఒక పదార్థం నోట్లోకి వచ్చింది. మొదట అది ఐస్‌క్రీమ్‌లో ఉండే డ్రైఫ్రూట్స్‌కు చెందిన ఏదైనా పలుకు అని భావించాడు. కానీ, అనుమానించి బయటకు ఊసి చూడగా గోరుతో ఉన్న చిన్న మాంసపు ముక్క కనిపించింది.

ఇది చూడగానే ఫిర్రావ్‌ భయాందోళనకు గురయ్యారు. వైద్యుడైన అతడు ఈ మాంసపు ముక్క మనిషి బొటనవేలిగా గుర్తించి షాక్‌ తిన్నారు. ఈ విషయమై కంపెనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిర్యాదు చేసినా స్పందించలేదు.  ఈ మాంసపు ముక్కను ఒక ఐస్‌ బ్యాగ్‌లో వేసుకొని మలద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన ఆ ఐస్‌క్రీమ్ తయారీదారుని లైసెన్స్‌ను ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news