ఈనెల 31లోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన పనులు ఇవే

-

మరో రెండ్రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చి 31వ తేదీ నాటికి తప్పక పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాలు ఉన్నాయి. మరి అవేంటో, వాటి వివరాలను ఓసారి చూద్దామా ?

బ్యాంకుల్లో ఆధార్‌, పాన్‌ కార్డులాంటివి లేకపోతే కేవైసీని అప్‌డేట్‌ చేయాలి.

ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్‌ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతినిచ్చింది. వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నవారు కేవైసీని పూర్తి చేయండి. అధికారిక ధ్రువీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు తగిన వివరాలు సమర్పించి, దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

సొంతిల్లు కొనాలనుకునే వారికి పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకూ రుణాలను ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news