తమలపాకుతో వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు.. షుగర్‌ కంట్రోల్‌ చేయొచ్చు..!

-

భోజనం చేసిన తర్వాత తమలపాకు తినడం భారతీయుల ప్రాచీన ఆచారం కాబట్టి చాలా మంది తమలపాకు తినకుండానే భోజనం ముగించరు. కానీ ఇది ఒకప్పటి ఆచారం.. మన పెద్దోళ్లు ఇలా చేసేవాళ్లు.. ఇప్పుడు ఎవరూ తమలపాకులు తినేందుకు ఇష్టపడటం లేదు. కానీ తమలపాకుల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు. తమలపాకు అంటే కేవలం పూజల్లో మాత్రమే వాడే ఐటమ్‌ కాదు.. దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి.. అవి ఏంటంటే..
తమలపాకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తమలపాకులోని పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఫలితంగా తమలపాకులు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
betel leaf
మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, నిపుణుల సలహా మేరకు తమలపాకులను తినొచ్చు..అంతే కాకుండా విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటే ఔషధానికి బదులు తమలపాకులను నివారిణిగా ఉపయోగించవచ్చు. దీని కోసం తమలపాకులను పేస్టులా చేసి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.
బరువు తగ్గడానికి తమలపాకులు బెస్ట్ రెమెడీ. ఎందుకంటే ఈ ఆకు శరీరంలో మెటబాలిక్ రేటును పెంచి బరువు పెరగకుండా చేస్తుంది. ముఖ్యంగా, తమలపాకులు క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఎందుకంటే ఇది లాలాజలంలో ఆస్కార్బిక్ ఆమ్లం స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.
తమలపాకును నేరుగా తినడం కష్టంగా ఉంటే.. బదులుగా, 10 నుండి 12 తమలపాకులను కొన్ని నిమిషాలు ఉడకబెట్టి, నీటిలో తేనె కలపి తాగొచ్చు. ఖాళీ కడుపుతో తమలపాకును తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మీకు కడుపు సమస్యలు ఉంటే మీరు ఖాళీ కడుపుతో తమలపాకును తింటే మంచిద. ప్రతిరోజూ ఉదయాన్నే తమలపాకులను తినడం వల్ల పోషకాల లోపాలను దూరం చేసుకోవచ్చట. ఛాతీ, ఊపిరితిత్తులు, ఆస్తమాతో బాధపడేవారికి తమలపాకు అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news