గుజరాత్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3:30 గంటలకు సూరత్‌లోని హజీరా ఆధారిత ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించిందని, చాలా దూరం వరకు మంటలు కనిపించాయని స్థానికులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
#WATCH Gujarat: A fire breaks out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/6xPKHW5PrR
— ANI (@ANI) September 23, 2020