బాబు విశ్వప్రయత్నాలు… జనం నుంచి స్పందనకరువేలా?

-

రౌడీఇజం, గూండాఇజం చేసే వ్యక్తి.. అవినీతి పరుడు.. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి.. రాజకీయ అనుభవం శూన్యం.. ఇవన్నీ జగన్ ఎన్నికలకు వెళ్లే సమయంలో టీడీపీ నేతలు, చంద్రబాబు కలిసి చేసిన ఆరోపణలు! జనం నమ్మలేదు.. చరిత్రపుటల్లో నిలిచిపోయే మెజారిటీతో గెలిపించారు ముఖ్యమంత్రిని చేశారు. అయినా బాబు మారలేదు!

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారణ్ చేసినప్పటినుంచి తనదైన ప్రజారంజక పాలనతో దూసుకుపోతున్నారు జగన్. బాబుకు కన్ను కుడుతుంది… రకరకాల ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నచందంగా బాబు వెనక్కి తిరిగిచూసుకోకుండా ముందుకుపోతున్నారు! అనంతరం… బీసీలను అణగదొక్కే కార్యక్రమాలు చేసే వ్యక్తి.. క్రైస్తవ్యాన్ని ప్రోత్సహించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి.. హిందుత్వాన్ని అణగదొక్కే వ్యక్తి.. దళితులను అణగదొక్కుతున్నారు.. మాతృబాషను నాశనం చేయడానికి పూనుకున్న వ్యక్తి అంటూ మళ్లీ మైకందుకున్నారు! జనం నమ్మడం లేదు!

తాజాగా తిరుమలలో కొండపైన సంతకం పెట్టాలంటూ ఇంతకాలం బాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోని విషయాన్ని తెరపైకి తెచ్చి కాసేపు జగన్ ని ఇరుకున పెట్టాము అనే సంతృప్తిని మూటగట్టుకున్నారు! నలుగురైదుగురు స్వామీజీలను టీవీ ఛానల్స్ పైకి వదిలారు! జనం నమ్మడం లేదు! ఇంతకూ జనం ఏమనుకుంటున్నారు.. సామాన్యుడికి ఇవన్నీ అవసరమా?

మేము జగన్ ని ముఖ్యమంత్రిగా ఎంచుకున్నది… ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని కాదు.. క్రైస్తవ్యుడు అని కాదు.. హిందూ అనీ కాదు! సామాన్యుడి కష్టాలు తెలిసినవాడని.. అవి అర్ధం చేసుకుని తీరుస్తాడని.. ఒక అన్నలా, కొడుకులా, మేనమామలా అందరికీ తోడుంటాడని! రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తాడని! అదే కదా జనానికి కావాల్సింది!! కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎంతో అండగా ఉన్న నాయకుడు!! కొండపై రాజకీయ రగడ సామాన్యుడికి అవసరం లేదు!! ఈ అంకం ముగిసింది… బాబు మళ్లీ ఎత్తుకోబోయే అంశం ఏమిటో!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news