భారత్ చైనా సరిహద్దుల్లో భారీ కాల్పులు…!

-

భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. చైనా వైఖరి రోజు రోజుకి హద్దులు దాటిపోతుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా భారత ఆర్మీ క్యాంపులపై కాల్పులు జరిపింది. సోమవారం రాత్రి కాల్పులు జరిగిన తరువాత, చుషుల్ ప్రాంతంలో సాయుధ రెజిమెంట్లు మరియు దళాలను భారీగా మోహరించింది భారత ఆర్మీ. ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించడం ద్వారా తూర్పు లడఖ్ సెక్టార్‌ లో భారత ఆర్మీ పై పట్టు సంపాదించాలి అని చైనా భావిస్తుంది.

పిఎల్‌ఎ దళాలు భారత అర్మీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మరింత తీవ్రం కాకముందే రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. కాని సీనియర్‌ అధికారుల స్థాయిలో ఇరుపక్షాల సమయానుకూల జోక్యంతో అది కాస్త తగ్గిందని ఆర్మీ అధికారులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాల్లో భారీగా బలగాలు మొహరించాయి.

Read more RELATED
Recommended to you

Latest news