లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉద్ధృతంగా మారుతోంది. అయినా ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ ఈ వ్యవహారంపై స్పందించలేదు. అయితే తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని మీడియో రెజ్లర్ల ఆందోళనపై ప్రశ్నించగా.. ఆమె సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్రంలో బీజేపీ 9 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి మీనాక్షి లేఖి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమెను చుట్టుముట్టిన జర్నలిస్టులు ‘‘రెజ్లర్ల ఆందోళన పై మీ స్పందన ఏంటి?’’ అని ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మీనాక్షి లేఖి వెళ్తుండగా.. విలేకరులు కూడా ఆమెను అనుసరించారు. అదే ప్రశ్నను మళ్లీ అడగ్గా.. ‘‘న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది’’ అని చెబుతూ ఆమె పరిగెత్తారు. కేంద్రమంత్రి ‘చలో.. చలో.. చలో’ అంటూ తన కారు వద్దకు పరిగెట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
महिला पहलवानों के मुद्दे पर केंद्रीय मंत्री मीनाक्षी लेखी ने दी तीखी प्रतिक्रिया
आप खुद देखें 👇 pic.twitter.com/9XqyJcwmgD
— Congress (@INCIndia) May 30, 2023