ఇకపై OTTలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం

-

సినిమా చూడటానికి థియేటర్​కు వెళ్లిన ప్రేక్షకులకు హీరోహీరోయిన్ల కంటే ముందు కనిపించేది ముకేశ్. అదేంటి.. అతనెవరు అనుకుంటున్నారా..? అదేనండి నా పేరు ముకేశ్ అంటూ పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల తనకు జరిగిన నష్టం గురించి చెబుతూ ఉంటాడు కదా అతడే. థియేటర్లలో పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా యాడ్స్ రావడం పరిపాటే. మనకు విసుగుపుట్టినా.. నచ్చకపోయినా ఆ ఐదు నిమిషాలు ఆ యాడ్ చూడాల్సిందే. అయితే ఇది ఇన్నాళ్లు కేవలం థియేటర్లకు మాత్రమే పరిమితమైంది. అయితే తాజాగా ఈ ఆనవాయితీని ఓటీటీల్లో కూడా షురూ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. సదరు పబ్లిషర్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news