వాట్సాప్‌లో ‘మెసేజ్’ ఎడిట్ ఫీచర్!

-

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను అందిస్తూ వస్తుంది.. గతంలో ఎన్నో ఫీచర్లను అందించింది.. ఇప్పుడు తాజాగా మరి కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. పొరపాటున మనం ఎవరికైనా ఏదైనా మెసేజ్ పంపితే దానిని ఎడిట్ చేయలేము. కచ్చితంగా డిలీట్ చేసే మళ్ళీ పంపాలి. కొత్త ఫీచర్ తో ఇకపై మాత్రం డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

మనం పంపిన మెసేజ్ లో తప్పు ఉంటే ఎడిట్ ఆప్షన్ తో దాన్ని సవరించుకునే అవకాశం ఉందంటుంది. వాట్సాప్ తీసుకొస్తున్నా ఈ ఫీచర్ తో మనం మెసేజ్ పంపిన 15 నిమిషాల్లో మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ టైం దాటితే ఎడిట్ ఆప్షన్ రాదు. మనం పంపిన మెసేజ్ ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మెసేజ్ పై క్లిక్ చేసి కాసేపు హోల్డ్ లో పెట్టాలి. అప్పుడు కాపీ అనే ఆప్షన్ తో పాటు ఎడిట్ అనే కొత్త ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం పంపిన మెసేజ్ లో మార్పులు చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో ఎన్నిసార్లు అయినా మార్పు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news