తెలంగాణ ప్రజలకు శుభవార్త..ఇకపై ఆ ప్రాంతాల్లోనూ డయాలసిస్ కేంద్రాలు

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త. డయాలసిస్ కేంద్రాలపై కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంగా మారాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. డయాలసిస్ సేవలను మారుమూల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన సేవలు సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు 102 కేంద్రాలకు విస్తరించాయన్నారు. ‘సిర్పూర్-కాగజ్ నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లోనూ డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. కేంద్రాలకు చేరేందుకు రోగులకు ఉచిత బస్ పాస్ లు ఇస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి, సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైందన్నది అక్షర సత్యం అని మంత్రి హరీష్ రావు ట‌్వీట్ చేశారు.

https://twitter.com/BRSHarish/status/1658113102838222854?s=20

Read more RELATED
Recommended to you

Latest news