మధ్యప్రదేశ్ లో విచిత్రం.. 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రిగా ఎమ్మెల్యే ప్రమాణం

-

ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రి అయ్యారు. రొటీన్‌కు భిన్నంగా విచిత్రంగా మంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ అసాధారణ సంఘటన జరిగింది.  ఏప్రిల్‌లో బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంనివాస్ రావత్‌ను సీఎం మోహన్‌ యాదవ్‌ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే రొటీన్‌కు భిన్నంగా మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. సోమవారం ఉదయం 9.03 గంటలకు రాజ్‌భవన్‌లో రాంనివాస్ రావత్‌తో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జూనియర్‌ పదవి ఉన్న మంత్రిగా తొలుత ఆయన ప్రమాణం చేశారు.

దాదాపు 15 నిమిషాల తర్వాత రాంనివాస్ రావత్‌ క్యాబినెట్ మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అసాధారణంగా రెండుసార్లు మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయకుండా, పార్టీ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేగా ఉన్న రావత్‌ మంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. బీజేపీలో చేరిన రావత్‌తోపాటు నిర్మలా సప్రేపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్‌ను కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news