అలా జరిగితే.. కాంగ్రెస్ నా కాలర్‌ పట్టుకోవచ్చని చూసింది : మోదీ

-

టసుడాన్​లో ఒక్క భారతీయుడికి బుల్లెట్ తగిలినా నా కాలర్ పట్టుకోవాలని కాంగ్రెస్ చూసిందిట అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘‘అవాంఛనీయ ఘటనను సాకుగా చూపి, మోదీ కాలర్‌ పట్టుకొని రాజకీయాలు చేయాలని చూశారు. కాంగ్రెస్‌ పార్టీ నన్ను ఇంకా అర్థం చేసుకోలేదని అనుకొంటా. సంక్షోభంలో చిక్కుకొన్న ప్రతి భారతీయుడి రక్షణకు ఎంతవరకైనా వెళతా’’ అని మోదీ స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు అంశాన్ని కేంద్రంగా చేసుకొని కన్నడ కాంగ్రెస్‌ నేతలపై మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. సిరోహీ జిల్లాలోని అబు రోడ్డు టౌనులో జరిగిన ర్యాలీలో ప్రధానమంత్రి మాట్లాడారు.

కర్ణాటకలోని హక్కి పిక్కి గిరిజన తెగకు చెందిన (పిట్టలు పట్టేవారు) దాదాపు 200 మంది సూడాన్‌ అల్లర్ల నడుమ చిక్కుకొన్నారని, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వైఖరి కారణంగా వారి జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. మోదీకి హాని చేయాలనుకునే లక్ష్యసాధనలో కాంగ్రెస్‌ పార్టీ దేశ సంక్షేమాన్ని కూడా పట్టించుకోదని విమర్శించారు. ‘ఆపరేషన్‌ కావేరి’ ద్వారా హక్కి పిక్కి తెగల వారితోపాటు అందరినీ తాము సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చినట్లు ప్రధాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news