కంటెంట్ ఉన్నోడు బీచ్‌లో కుర్చీ వేసుకుని కూర్చుంటే చాలు ఓ దేశం ఆర్థిక పరిస్థితులు తలకిందులు అయిపోతాయ్ మరి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టామినా అలాంటిది.ఈ నరేంద్రుడు అడుగు పడితే చాలు పర్యాటక రంగం పూర్తిగా మారిపోవడమే కాదు పక్క దేశాల ఆర్ధిక పరిస్థితులు కుదేలు అవుతున్నాయి.మోడీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవ్స్ ప్రభుత్వానికి ఈ పాటికే అర్థమైపోయింది.లక్ష్యద్వీప్‌లో మోడీ నడిచిన వంద అడుగుల ప్రభావంతో మాల్దీవుల ఆర్థిక స్థితి పడిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కరుడుగట్టిన దేశభక్తుడి సంకల్పం ఎంత బలంగా ఉంటుందో ఈ ఒక్క సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.
భారతదేశాన్ని దెబ్బతీయాలనుకున్న అనేక దేశాలు ఇప్పుడు మోడీ ప్రభావంతో సలాం కొడుతున్నాయి. కయ్యానికి దిగిన దేశాలు సైతం ఇప్పుడు నెయ్యానికి చేతులు చాస్తున్నాయి.అమెరికా పశ్చిమ దేశాలు, జపాన్ ఇంకా ఆస్ట్రేలియా వంటి దేశాలు మోడీ ఉంటె చాటుకొండంత అండ అంటున్నాయి.అతను కొన్ని కోట్ల మంది భారతీయుల గుండె చప్పుడు-నవ భారత నిర్మాణానికి పూనుకున్న మరో విశ్వకర్మ.భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్న స్వచ్ఛమైన భారతీయుడు.దేశానికి హాని తలపెట్టాలని చూస్తే ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుకాడరు నరేంద్ర మోడీ. ఇందుకు కరోనా సమయంలో భారత సరిహద్దుల్లో చైనా అలజడి సృష్టించగా ఫలితంగా ఆదేశం ఆర్థిక వ్యవస్థపై మోడీ గట్టి దెబ్బే కొట్టాడు..
బాంబులు వేసి బెదిరించలేదు.రాయబారాలతో బ్లాక్‌మెయిల్ చేయలేదు.కానీ వాళ్ళకు చలిజ్వరం వచ్చేలా చేశారు.ఇప్పుడు మాల్దీవుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం.మాల్దీవుల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన పార్టీని అక్కడి ప్రజలు గెలిపించారు. దీంతో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పాటయింది. అయితే మాల్దీవుల ఆర్థిక మూలమైన టూరిజంను దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్ వేశారు మోదీ. కొత్త సంవత్సరం వేళ ఆయన లక్ష్యద్వీప్‌లో పర్యటించారు. అక్కడ సముద్రం ఒడ్డున కుర్చీలో కూర్చున్నారు. బీచ్‌లో నడిచారు. స్నోర్కెలింగ్ చేశారు.ఈ మేరకు ఫొటోలను ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో పోస్టు చేశారు. లక్ష్యద్వీప్ పర్యాటకంగా ఎంతో ఆకట్టుకుంటుందని స్నోర్కెలింగ్ చేసేవారు లక్ష్యద్వీప్ వెళ్లాలని సూచించారు.
అక్కడి ప్రకృతిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మోదీ వివరించారు. దీంతో మాల్దీవులపై మోదీ ప్రభావం పడింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అనేక మంది రద్దు చేసుకున్నారు. లక్ష్యద్వీప్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బాలీవుడ్ ప్రముఖులు కూడా లక్ష్యద్వీప్ పర్యాటకానికి మద్దతుగా నిలుస్తున్నారు. సల్మాన్‌ఖాన్, అమితాబచ్చన్‌తోపాటు అనేక మంది మాల్దీవులకన్నా లక్ష్యద్వీప్ చాలా అందంగా ఉంటుందని, ఆహ్లాదకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టులు చేస్తున్నారు. దీంతో మాల్దీవులకు వెళ్లే భారతీయ వ్యాపారులు, పర్యాటకులు మనసు మార్చుకుంటున్నారు. మాల్దీవుల్లో ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లు రద్దు చేసుకుంటున్నారు. దీంతో అక్కడి మంత్రులు మోదీ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ప్రధాని మోదీపై ఎక్స్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణం తమ ఆదాయం తగ్గడమే.
మాల్దీవుల మంత్రులు భారత ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.మోదీపై విమర్శలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది.పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.మోదీ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారు. ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక దేశ భద్రత, రక్షణ, ఆర్థిక వృద్ధి, శత్రుదేశాల నాశనం ఉంటాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే.. పెద్దనోట్ల రద్దు ఒకటి. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌ను అడుక్కుతినేలా చేస్తానని శపథం చేశారు మోదీ. ఆయన అన్నట్లుగానే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దొంగనోట్ల చలామణి తగ్గింది. చివరకు పాక్ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ప్రపంచంలో ఎవరైనా సాయం చేస్తేగానీ మనుగడ సాధించలేని స్థితికి చేరింది. ఇక చైనా విషయంలోనే అంతే. గాల్వాన్‌లో భారత సైన్యంపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన మోదీ చైనా ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూనే ఉన్నారు. అనేక చైనా యాప్స్‌ను రద్దు చేసి చైనా దిగుమతులపై నిషేధం విధించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి మన కరెన్సీలోనే రష్యా నుంచి ఇంధనం కొనుగోలు ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ అనేక నిర్ణయాల వెనుక దేశప్రయోజనాలు దాగి ఉన్నాయి.