వంద శాతం మేమే గెలుస్తాం.. నేను కూడా బ్యాటింగ్ చేస్తా – బౌలర్‌ షమీ

-

ఆస్ట్రేలియాతో ఫైనల్లో టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని భారత పెసర్ మహమ్మద్ షమీ ధీమా వ్యక్తం చేశారు. ‘మంచిగా బ్యాటింగ్ చేస్తే 280 పెద్ద స్కోర్ ఏం కాదు. సాధారణ టెస్టు మ్యాచ్ లాగా ఆడాలి. ప్రతి బాల్ పై ఫోకస్ చేయాలి. నేను బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నా. టీంలో అందరూ బ్యాటింగ్ చేయగలరు. తప్పకుండా మేము మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.

కాగా, రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ గిల్ క్యాచ్ అవుట్ అవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై గిల్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. థర్డ్ అంపైర్ కు కళ్లు కనిపించవా అని అర్థం వచ్చేలా గ్రీన్ క్యాచ్ పట్టేటప్పుడు బాల్ నేలకు తాకిన ఫోటోను షేర్ చేశారు. భూతద్దాల ఎమోజీలతో సెటైర్లు వేశారు. కాగా, ఇది నాటౌట్ అని భారత ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరేత్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news