అస్సాంలో రూ.2వేల కోట్లకు పైగా స్కాం.. నటి, ఆమె భర్త అరెస్టు!

-

అస్సాంలో సంచలనం రేపిన రూ.2వేల కోట్లకు పైగా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభ‌కోణంలో స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం న‌టి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను సైతం అరెస్టు చేశారు.పెట్టుబ‌డి డబుల్ చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో కేటుగాళ్లు జ‌నాల నుంచి భారీ ఎత్తున డబ్బును సమీకరించిన విషయం తెలిసిందే. ఈ కుంభ‌కోణం విలువ సుమారు రూ.2వేల కోట్లు ఉంటుంద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ భారీ స్కాంలో ఇప్ప‌టికే విశాల్ పుకాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాల్ 60 రోజుల్లో పెట్టుబ‌డుల‌పై 30 శాతం రాబ‌డి వ‌స్తుంద‌ని ప్రజలను నమ్మించాడు.అలా భారీ మొత్తంలో సొమ్మును దండుకుని అస్సాం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పెట్టుబ‌డులు పెట్టినట్లు విచారణలో తెలిసింది. అందుకోసం అతను నాలుగు నకిలీ సంస్థ‌ల‌ను కూడా స్థాపించినట్లు తేలింది. ఈ స్కామ్‌లో బోరా దంప‌తుల‌తో పాటు మ‌రికొంద‌రిపై ఆరోప‌ణ‌లు వినిపిస్తుతండగా.. విశాల్ అరెస్టు త‌ర్వాతే వీరిని పోలీసులు విచార‌ణ‌కు పిలిచారు. అయితే, బోరా దంప‌తులు హాజ‌రుకాలేదు.దాంతో వీరిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి నేడు అరెస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news