పిల్లల్లో ఐరన్ లోపం లేకుండా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వలన పిల్లలలో ఐరన్ లోపం లేకుండా ఉంటుంది. చికెన్, లీన్ ప్రోటీన్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపాన్ని నివారించడానికి సహాయపడుతుంది. వారానికి రెండు సార్లు చికెన్ పెట్టండి. ఆకుకూరల్ని కూడా పిల్లలకు ఇవ్వాలి. ఐరన్ అధికంగా లభించే ఆకుకూరలు ఇస్తే ఐరన్ లోపం లేకుండా ఉండొచ్చు. పాలకూర, బచ్చలకూర, తోటకూరలో విటమిన్ సి తో పాటుగా ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.
అలాగే పిల్లలకి బీన్స్, పప్పు దినుసులను కూడా ఇవ్వండి. వీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లెవెల్స్ ని పెంచుకోవడానికి అవుతుంది. గుమ్మడి విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియాగింజల్ని కూడా పిల్లలకు పెట్టండి. రక్తహీనత సమస్యను ఇది తగ్గిస్తుంది. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ పెడితే కూడా పిల్లల్లో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపం ఉండదు.
పిల్లల్లో ఐరన్ ని పెంచడానికి కోడి గుడ్డు పెట్టండి. కోడి గుడ్డు తినడం వలన పిల్లలకి ఐరన్ అందుతుంది. బలం కూడా ఉంటుంది. టోఫుతో పాటుగా మిగతా సోయా ఉత్పత్తులను కూడా పిల్లలకు ఇవ్వండి. ఐరన్ బాగా అందుతుంది. రక్తహీనత సమస్య ఉండదు. సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో విటమిన్ డి తో పాటుగా ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇవి కూడా పెట్టొచ్చు. అలాగే పప్పు దినుసులలో ప్రోటీన్ తో పాటుగా ఐరన్ ఉంటుంది కాబట్టి అవి కూడా పిల్లలకి ఇవ్వండి.