దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఒక మెసేజ్ వచ్చినట్లు వారు వెల్లడించారు.
26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందేశం పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.