నాందేడ్​ ఆస్పత్రిలో మరణమృదంగం.. 108 మంది మృతి!

-

సిబ్బంది కొరత, ఔషధాల కొరత వల్ల ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో రోగులు, చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే ఈ మృత్యుఘోష ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గడిచిన ఎనిమిది రోజుల్లో ఈ ఆస్పత్రిలో మరో 108 మరణాలు సంభవించాయి. కేవలం గత 24 గంటల్లోనే 11 మంది రోగులు మరణించారు. వీరిలో ఓ పసికందు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మరణించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో 100కు పైగా రోగులు మరణఇంచినా.. ఇప్పటికీ ఆ రాష్ట్ర సర్కార్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు వరుస మరణాలపై నాందేడ్ ఆసుపత్రి డీన్‌ మరోసారి స్పందించారు. ఔషధాల కొరత కారణంగా ఏ రోగీ ప్రాణాలు కోల్పోవట్లేదని వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోతున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. మరోవైపు జాతీయ మానవహక్కుల కమిషన్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news