ల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో ఈరోజు ఉదయం ఎన్డీయే ఎంపీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి 240 మంది బీజేపీ ఎంపీలతోపాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్), ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీరంతా మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం చంద్రబాబు, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను ఆమెకు సమర్పించి.. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు. ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే.