పీఎంగా మోదీ హ్యాట్రిక్.. 293 సీట్లు గెలిచిన ఎన్డీఏ కూటమి

-

యావత్‌ భారతావనిని ఉత్కంఠతో ఊపేసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీ పైచేయి సాధించింది.  240 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. ఇండియా కూటమి 231 నియోజకవర్గాల్లో గెలిచి, 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ మరోసారి అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్కు (272)ను మాత్రం అది అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ), శివసేన (శిందే వర్గం) వంటి పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.

400 స్థానాలను గెల్చుకోవడమే లక్ష్యమంటూ ‘చార్‌ సౌ పార్‌’ నినాదమిచ్చిన బీజేపీ.. అయితే ఆ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయింది. మోదీ రాజకీయాల్లోకి వచ్చాక.. అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి. బీజేపీ సొంతంగా 2019లో 303, 2014లో 282 సీట్లు గెల్చుకుంది. ఈసారి తన మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి మొత్తం 293 సీట్లు గెలుచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news