ఓవైపు నది ఉద్ధృతి.. మరోవైపు కటిక చీకటిలో.. NDRF డేరింగ్ ఆపరేషన్‌

-

ఉత్తర భారతాన్ని వరణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నారు. ముఖ్యంగా దిల్లీ, హిమాచల్ ప్రదేశ్​ వంటి రాష్ట్రాలు వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్నాయి. హిమాచల్​లో బియాస్‌ నది వరదలకు ఉప్పొంగుతోంది. ఉగ్రరూపం దాల్చిన బియాస్​ నది వల్ల పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టి బియాస్‌ నదిలో చిక్కుకున్న ఆరుగురిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు.

మండి జిల్లాలోని నగ్‌వయిన్‌ గ్రామ సమీపంలో బియాస్‌ నదిలో పలువురు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని.. కటికచీకటిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో అర్ధరాత్రి డేరింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. జిప్‌ లైన్‌ ఏర్పాటు చేసి కేబుల్‌ సాయంతో వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఓ వ్యక్తి కేబుల్‌ను గట్టిగా పట్టుకోగా.. సిబ్బంది లాగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సాహసోపేతంగా వ్యవహరించి ప్రజలను కాపాడటం చూసిన నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news