బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవలే కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అక్షయ్‌తోపాటు మరికొందరు నటులకు కోవిడ్ సోకింది. అయితే డాబర్ కంపెనీకి చెందిన చ్యవన్‌ప్రాశ్‌కు అక్షయ్ కుమార్ గతంలో ప్రచారం నిర్వహించాడు. ఈ క్రమంలో తాజాగా అతనికి కోవిడ్ సోకడంతో డాబర్ కంపెనీని, అక్షయ్‌ని నెటిజన్లు ఆడుకుంటున్నారు.
అక్షయ్ కుమార్ కోవిడ్ బారిన పడడంతో అతను ప్రచారం చేస్తున్న చ్యవన్ ప్రాశ్ యాడ్‌ను డాబర్ కంపెనీ తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చ్యవన్‌ప్రాశ్ తింటే కోవిడ్ రాదని డాబర్ ప్రచారం చేసింది. అక్షయ్ కుమార్ కూడా ప్రచారం చేశాడు. కానీ అతను కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో ఆ కంపెనీ ఆ యాడ్‌ను విరమించుకుంది. అయినప్పటికీ నెటిజన్లు డాబర్ కంపెనీతోపాటు అక్షయ్ కుమార్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు విమర్శలను ఎదుర్కొంటున్నారు.
నిజానికి ఇలా సెలబ్రిటీలకు ట్రోల్స్ రావడం కొత్తేమీ కాదు. బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మొన్నా మధ్య హార్ట్ ఎటాక్‌కు గురి అయిన విషయం తెలిసిందే. ఆయన అంతకు ముందు ఓ వంట నూనెల కంపెనీ యాడ్‌లో కనిపించారు. ఆ నూనె తాగితే హార్ట్ ఎటాక్‌లు రావని ప్రచారం చేశారు. కానీ ఆయ హార్ట్ ఎటాక్ బారిన పడ్డారు. దీంతో ఆ కంపెనీ గంగూలీ నటించిన యాడ్‌లను వెనక్కి తీసుకుంది. కానీ ఆ కంపెనీని నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ కూడా ట్రోలింగ్ బారిన పడ్డాడు. అవును మరి.. కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతుంది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. అందుకనే ఆచి తూచి ప్రచారం చేయాలి. లేకపోతే ఇలా జరుగుతుంది.