ఇక జూన్ నెల కూడా పూర్తైపోతోంది. ఇక జూలై రాబోతోంది. అయితే జూలై ఒకటవ తేదీ నుండి కొన్ని అంశాలు మారనున్నాయి. వాటి గురించి ముందుగా తెలుసుకుంటే మంచిది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ జూలై ఒకటవ తేదీ నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కొత్త రూల్స్ తీసుకు వస్తోంది. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ మారబోతున్నాయి. అలానే చార్జీలు కూడా SBI పెంచింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ కొత్త నిబంధనలను వర్తిస్తాయి గమనించండి.
అలానే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మారే అవకాశం వుంది. ప్రతీ నెలా ధరల్లో మార్పులు వస్తాయి కనుక ఈ నెల కూడ మారచ్చు లేదా మారకుండా అలానే స్థిరంగా ఉండచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని వారు ఈ నెలలోపు చేసేయడం మంచిది. లేదు అంటే జూలై 1 నుంచి డబుల్ టీడీఎస్ చెల్లించుకోవాల్సి వస్తుంది గమనించండి.
మారుతి సుజుకీ, హీరో మోటొకార్ప్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచాయన్నది తెలిసిందే. అయితే జూలై 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.
సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు వచ్చే నెల నుంచి చెల్లవు. కొత్తగా కెనరా బ్యాంక ఐఎఫ్ఎస్‌డీ కోడ్లు ఉపయోగించాలి. ఈ విషయం కస్టమర్స్ గమనిస్తే మంచిది.