విరాళాలు లేకుండా పార్టీని నడపలేం: ఎన్నికల బాండ్లపై గడ్కరీ వ్యాఖ్యలు

-

లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్నికల బాండ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. మంచి ఉద్దేశంతోనే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను కేంద్రం ప్రవేశ పెట్టిందన్న గడ్కరీ.. విరాళాలు లేకుండా ఏ రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ ఎన్నికల బాండ్ల అంశాన్ని ప్రస్తావించారు. అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం గురించి జరిగిన చర్చల్లో తాను కూడా పాల్గొన్నానని తెలిపారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని చెప్పిన గడ్కరీ.. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదని, అందుకే కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చిందని వెల్లడించారు. పార్టీలు నేరుగా నిధులు పొందడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news