భారతీయులు ఇక ఇంట్లో నుంచే అమెరికాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

-

అమెరికాలో ఉన్న భార‌తీయుల‌కు ఇండియాలో ఉన్న వారి బంధువులు, కుటుంబ స‌భ్యులు లేదా స్నేహితులు డ‌బ్బులు పంపించాలంటే అనేక ర‌కాల మార్గాలు ఉన్నాయి. కానీ వాటికి కొంత శ్ర‌మించాలి. అయితే ఇక‌పై ఆ ఇబ్బంది ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఇండియాలో ఉండి కూడా అమెరికాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌చ్చు. అవును.. ఓ స్టార్ట‌ప్ ఇందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది.

now indians can open account in usa while sitting at home

అమెరికాలో ఏల్డ్రా అనే స్టార్ట‌ప్‌ను ఎన్ఆర్ఐ సుకీర్త్ శంక‌ర్ ప్రారంభించాడు. ఈ స్టార్ట‌ప్ ద్వారా ఇండియ‌న్లు అమెరికాలో బ్యాంక్ అకౌంట్ తెర‌వ‌చ్చు. అందుకు కేవ‌లం పాస్‌పోర్టు, ఆధార్ కార్డు ఉంటే చాలు. కేవ‌లం 10 నిమిషాల్లోనే అమెరికాలో బ్యాంక్ అకౌంట్ తెర‌వ‌చ్చు. ఇక దీనికి మ‌న దేశంలో అన్ని బ్యాంకులు అందించిన‌ట్లుగానే అన్ని స‌దుపాయాలు ఉంటాయి. డెబిట్‌, క్రెడిట్ కార్డులు, లోన్లు ఇస్తారు.

ప్ర‌స్తుతం బీటా ద‌శ‌లో ఉన్నందున రోజుకు 30 అకౌంట్ల‌ను మాత్ర‌మే తెరుస్తున్నారు. కానీ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఆర్‌బీఐ నిబంధ‌నల ప్ర‌కారం భార‌తీయ పౌరులు ఏడాదికి 2.50 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌రు వేరే ఏ దేశానికి అయినా న‌గదును పంపించ‌వ‌చ్చు. దీంతో ఏల్డ్రా ద్వారా అందించే బ్యాంక్ అకౌంట్ ఎంతో మందికి ఉప‌యుక్తం కానుంది. ముఖ్యంగా అమెరికాలో స్థిర‌ప‌డ్డ వారికి చెందిన ఆత్మీయులు ఇండియాలో ఉంటే వారు సుల‌భంగా న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అదేవిధంగా అమెరికాలో ఇప్ప‌టికే వ్యాపారాలు చేసేవారికి, కొత్త‌గా వ్యాపారాలను ప్రారంభించే వారికి కూడా ఈ అకౌంట్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news