కరోనాపై ఎన్.వి.రమణ సంచలన వ్యాఖ్యలు.. ఇది ఓ సైలెంట్ కిల్లర్ !

-

కరోనా మహమ్మారి, ఓమిక్రాన్ వేరియంట్ లపై సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయి లో భౌతిక విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ వేసింది. ఈ సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా, ఓమిక్రాన్ నిశబ్ద కిల్లర్ అని వ్యాఖ్యానించారు. మెదటి వేవ్ లో కరోనా వచ్చినప్పటికి తాను కేవలం నాలుగు రోజుల్లో కోలుకున్నానని పేర్కొన్నారు. కానీ ఓమిక్రాన్ సోకటం వల్ల నేను గత 25 రోజుల నుంచి భాదపడుతున్నానని వెల్లడించారు సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.

ఇప్పటికి ఇంకా కేసుల సంఖ్య తగ్గలేదు రోజుకి 15000 వెలకు పైగా కేసులు వస్తున్నాయని గుర్తు చేశారు. ఎప్పుడు భౌతికంగా కేసులు విచారణ చెపట్టాలో తాము చెప్తామని స్పష్టం చేశారు. జనవరి మాసంలో కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరినప్పుడు 10 మందికి పైగా సుప్రీంకోర్టు జడ్డిలకు కరోనా సోకిందని చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news