ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజున, భారతదేశంలో ఒకే రోజు రెండు కోట్ల వ్యాక్సిన్స్…!

శుక్రవారం నాడు భారతదేశంలో రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులని వేయడం జరిగింది. అయితే ఒక్క రోజు లో ఇన్ని వ్యాక్సిన్స్ ని వేయడం మామూలు విషయం కాదు. నిజంగా ఇది రికార్డ్. అయితే ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్ని వ్యాక్సిన్ డోసులు ప్రజలకు ఇచ్చారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఒకే రోజులు ఏకంగా 2.03 కోట్ల వ్యాక్సిన్ డోసులుని ఇచ్చి రికార్డు సృష్టించారు. అయితే ఇన్ని డోసులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఆగస్టు 31వ తేదీన ఒకే రోజులో 1.41 కోట్ల వ్యాక్సిన్స్ ని ఇచ్చారు. అయితే ఇంత మొత్తంలో వ్యాక్సిన్ డోసులుని ఇవ్వడం ఇది నాలుగవ సారి. శుక్రవారం సాయంత్రానికి భారతదేశంలో 79 కోట్ల వ్యాక్సిన్లను ఇచ్చినట్టు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా కోట్ల వ్యాక్సిన్స్ ని వేయడం జరిగింది. అయితే ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా బిజెపి రెండు కోట్ల వరకు వ్యాక్సిన్స్ ని వెయ్యాలని టార్గెట్ పెట్టుకుంది. ఎనిమిది లక్షల వాలంటీర్లను కూడా నియమించింది. బీజేపీ హెల్త్ కేర్ అఫిషియల్స్ ని రోజూ కంటే కూడా ఈరోజు రెట్టింపు వ్యాక్సిన్స్ ని ఇవ్వాలని చెప్పింది.

అయితే వ్యాక్సిన్ ని ఇంకా తీసుకోని వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని యూనియన్ హెల్త్ మినిస్టర్ Mansukh Mandaviya అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విభిన్నమైన బహుమతిని అందించాలని బిజెపి సీనియర్ లీడర్స్ అనుకోవటం జరిగింది. బీజేపీ జనరల్ సెక్రటరీ JP Nadda ప్రధాన నరేంద్ర మోదీ పుట్టినరోజు ని స్పెషల్ గా చేయాలని అనుకున్నారు దీని కంటే స్పెషల్ మరొకటి ఏముంటుందని అన్నారు. మోదీ వ్యాక్సిన్స్ గురించి ఎంత గానో శ్రమిస్తున్నారని.. నిజంగా ఆయనకి ఇదే పెద్ద బహుమతి అని చెప్పారు.