మోడీ ప్రమాణ స్వీకారం వేళ.. ఢిల్లీలో హై అలర్ట్

-

మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ  ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఈ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్ఓ కమాండోలాం. స్నైపర్లను మోహరించారు. ఈ కార్యక్రమానికి పొరుగుదేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. వారు నిర్దేశించిన మార్గాల్లో హోటల్ నుంచి వేదిక వద్దకు వస్తారని అధికారులు తెలిపారు.

ఆ మార్గాల్లో స్నైపర్లు, పోలీసు సిబ్బంది పహారా కాయనున్నారు. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు. అలాగే నేతలు బస చేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి. స్కానింగ్ మాటి వాటికోసం కృత్రిమమేధ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇక రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు. మోదీ సహా ఉన్నతస్థాయి వ్యక్తుల రాకపోకల వేళ.. వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం నుంచే ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 8 వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news