వన్‌ప్లస్‌ ఇండియాకు సీఈఓ నవనీత్‌ నక్రా రాజీనామా

-

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ఇండియాకు షాక్ తగిలింది. ఆ కంపెనీ సీఈఓ నవనీత్‌ నక్రా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఆయన రాజీనామాను వన్‌ప్లస్‌ ధ్రువీకరించింది. తన అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటున్నానని, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితం గడపాలనుకుంటున్నట్లు నక్రా చెప్పారు.

నవనీత్‌ నక్రా 2020లో వన్‌ప్లస్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా తన ప్రయాణం ప్రారంభించారు. 2021లో వన్‌ప్లస్‌ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు. వన్‌ప్లస్‌లో చేరకముందు యాపిల్‌ కంపెనీలో పనిచేశారు.

ఈ మూడేళ్ల ప్రయాణంలో వన్‌ప్లస్‌ ఇండియా అభివృద్దికి నక్రా ఎంతో కృషి చేశారని వన్‌ప్లస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన భవిష్యత్‌ ఆకాంక్షలు నెరవేరాలని ఆకాక్షించింది. ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని ఆశా భావం వ్యక్తం చేసింది.

భారత రీజియన్‌పై మునుపటి ఫోకస్‌ కొసాగుతుందని వన్‌ప్లస్‌ పేర్కొంది. నక్రా హయాంలోనే నార్డ్‌ సిరీస్‌లో మిడ్‌ సెగ్మెంట్‌ స్మార్ట్‌ఫోన్లతో పాటుు, ఇతర స్మార్ట్‌ డివైజులు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news