ఇప్పుడు బిజెపి సరికొత్త నినాదం: ‘లక్ పతి దీదీ’

-

మహిళ లబ్దిదారులకు మరింత చేరువ కావాలని యోచిస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇందులో భాగంగా లాక్ పతి దీదీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మోడీ నేతృత్వంలో ని నరేంద్రుని ప్రభుత్వం. నరేంద్ర మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల వేడుకల్లో భాగంగా, బీజేపీ మహిళా మోర్చా ఉత్తరప్రదేశ్ యూనిట్ జూన్ 3 నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు చెందిన మహిళా లబ్ధిదారులకు చేరువకానుంది. వారిని “లఖపతి దీదీలు” అని సంబోధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వారు “ధన్యవాదాలు” తెలియజెప్పేలా లెట్టర్లు రాయించేలా బీజేపీ చర్యలు చేపట్టింది.

లోక్ సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ లక్ పతి దీదీ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అవాస్ యోజన కింద ఇల్లు పొందిన మహిళల్ని కీర్తిస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు బీజేపీ అగ్రనేతలు. ఈ కార్యక్రమాన్ని జూన్ నుంచి విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా పైలట్ ప్రోజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. యూపీలో ప్రస్తుతం యోగి ప్రభుత్వం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాల్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపడితే మంచి ఫలితాలు వస్తాయి. అందుకే బలంగా ఉన్న యూపీ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు పొందిన మహిళలు యూపీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరుగుదొడ్లు, ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు కూడా వారు పొందారు. అలాంటి వారిని వారిని ఇప్పుడు లక్ పతి దీదీ అని పిలుస్తున్నారు బీజేపీ నేతలు..క్షేత్ర స్థాయిలో బిజెపి కార్యకర్తలు ఈ మహిళా లబ్ధిదారులను కలుసుకుంటారు. ఇల్లు పొందిన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పు గురించి అడుగుతారు. పార్టీ కార్యకర్తలు పరస్పర చర్యకు సంబంధించిన చిన్న వీడియోలను రికార్డ్ చేసి పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపుతారు. ఈ పథకం కింద ఇళ్లను అందించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ- “ధన్యవాద్ మోదీ జీ” అని లేఖ రాయమని కోరతారు. ఈ లేఖతో లబ్దిదారులు ఇంటితో దిగిన ఫోటోని కూడా పంపుతారు. NAMO యాప్ లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తారు.ఈ కార్యక్రమాన్ని మహిళ మోర్చా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఈ కార్యక్రమాన్ని యూపీ సీఎమ్ ఆదిత్యనాథ్ ప్రత్యేక శ్రద్ధతో ముందుకు నడిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మహిళ కార్యకర్తలకు అన్ని విధాలా సహకారం అందేలా ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. లాక్ పతి దీ దీ కార్యక్రమంతో బీజేపీ మరింతగా మహిళ శక్తిని కూడగడుతుందని… ఆ విధంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తామని యోగి ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవంతంగా యూపీలో వరుసగా రెండుసార్లు బీజేపీ సర్కారుని కొలువుదీర్చిన యోగి అటు లోక్ సభ ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీ సాధించి అత్యధిక ఎంపీ సీట్లను మోడీకి బహుమానంగా ఇవ్వాలని యోచిస్తున్నారు. మరి యోగికి అల్ ద బెస్ట్ చెపుదాం…

Read more RELATED
Recommended to you

Latest news