ఈ నెల 17, 18వ తేదీల్లో బెంగళూరులో రెండోసారి.. ప్రతిపక్షాల ఉమ్మడి భేటీ జరగనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరుకానున్నారు. ఈ సమావేశాని హాజరయ్యే పార్టీల సంఖ్య పెరగనుంది. గత నెలలో పట్నాలో జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 15 పార్టీలు హాజరుకాగా ఈ సారి తన ఆధ్వర్యంలో జరిగే భేటీకి 24 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా పార్టీల అధ్యక్షులకు లేఖలు పంపారు.
సోనియా గాంధీ 17వ తేదీ రాత్రి ప్రతిపక్ష నేతలకు విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ తరువాతి రోజు మరింత నిర్మాణాత్మక వ్యూహాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశానికి ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) తదితర పార్టీలు అదనంగా హాజరయ్యే అవకాశముంది. కాంగ్రెస్ ఆహ్వానం పంపిన 24 పార్టీలు ప్రస్తుతం 150 లోక్‌సభ సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.