మామకు జిరాక్స్ లా ఉన్న మహేష్ బాబు మేనల్లుడు.. టూ స్మార్ట్ గురూ..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్ గురించి, ఆయన స్వాగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా ఆయన పరిగెత్తే స్టైల్ ని బట్టి ముఖం చూడకుండానే అక్కడ మహేష్ బాబు అని చెప్పవచ్చు. తనకంటూ అలా ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ను రూపొందించుకున్నారు మహేష్ బాబు. ముఖ్యంగా అలాంటి మహేష్ బాబు స్వాగ్ ను ఎవరు బీట్ చేయలేరనే చెప్పాలి. ఇక ఎవరు ఎన్నిసార్లు మహేష్ బాబుని ఇమిటేట్ చేసినా సరే మహేష్ లాగా వుండే వాళ్ళు ఒకరు కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు.

ఒకవేళ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఉన్నా కూడా అతను కృష్ణ పోలికలతో కనిపిస్తాడు. అది కాకుండా గౌతం చాలా సైలెంట్.. తండ్రి యాటిట్యూడ్ ను స్వాగ్ ను ఎప్పుడు కూడా మ్యాచ్ చేసినట్లు అభిమానులు కూడా చూడలేదు. ఇక ప్రస్తుతం గౌతమ్ విదేశాలలో చదువులో బిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు. అయితే గౌతమ్ లేకపోతేనేమి అచ్చం మహేష్ ను దింపడానికి మేనల్లుడు ఉన్నాడుగా అంటున్నారు అభిమానులు.. అతడే చరిత్ మానస్.. మహేష్ బాబు అక్క ప్రియదర్శిని, బావ అలాగే హీరో సుధీర్ బాబు కొడుకే చరిత్ మానస్ .. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన చరిత్.. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అచ్చం మహేష్ బాబు లా జిరాక్స్ కాపీల కనిపిస్తున్నాడు.

ఆ నడక ,నవ్వు, ఆటిట్యూడ్ మొత్తం కూడా మహేష్ బాబుకు జిరాక్స్ ల ఉన్నాడే అని అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా సుధీర్ బాబు.. కూడా చరిత్ ను హీరో చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఒకవేళ ఈ కుర్రాడు హీరోగా మారితే జూనియర్ మహేష్ బాబు అనిపించుకోవడం ఖాయమని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చరిత్ మానస్ లుక్స్ కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట చాలా హల్చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news