విజయవాడలో సంచార్ సాథీ పోర్టల్ ను ప్రారంభించారు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్. ఈ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో విజయవాడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కార్యాలయం నుంచీ వీక్షించారు అధికారులు. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఒకొక్కరి పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్ ల ద్వారా చేసే నేరాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ ని వినియోగిస్తారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవి మాట్లాడుతూ.. సీఈఐఆర్ అనేది సంచార్ సాథీ పోర్టల్ కు మొదటి అంశం అన్నారు. ఫోన్ పోయినపుడు ఫోన్ బ్లాక్ చేయడానికి సంచార్ సాథీ పోర్టల్ ని వినియోగించవచ్చని తెలిపారు. డిజిటల్ ఐడెంటిటీ కోల్పోకుండా చూడటం కూడా ఒక అంశమన్నారు. అలాగే ఇందులో ‘Know Your Mobile’ ని రెండవ ఫీచర్ గా ఇచ్చామన్నారు. అంతే కాకుండా దీని ద్వారా మీ పేరుతో ఎన్ని ఫోన్ నంబర్ లు ఎక్కడెక్కడ దేశంలో తీసుకున్నారో తెలుసుకోవచ్చన్నారు.
వినయోగదారుడికి తెలీకుండా వేరెవరైనా ఫోన్ నంబరు తీసుకుంటే వెంటనే దానిని తీసేయచ్చన్నారు. నేరం చేయడానికి తీసుకునే ఫోన్ నంబర్లు తీసుకున్నా, ఫోటో మార్చి నంబరు తీసుకున్న తెలుసుకోవచ్చని వివరించారు. 87కోట్ల మొబైల్ ఫోన్లపై కనెక్షన్లను పరిశీలిస్తే… 42 లక్షల మోసపూరిత కనెక్షన్లు కనుగొని, 36 లక్షల కనెక్షన్లు రద్దు చేసామన్నారు. భారత టెలికాం సెక్టార్ ను గ్లోబల్ లీడర్ గా చేయడమే మా లక్ష్యం అన్నారు అశ్విని వైష్ణవ్.