“ఎన్టీఆర్ 30” మూవీ టైటిల్ ఇదేనా … !

-

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో డైరెక్టర్ కొరటాల శివ తో చేస్తున్న రెండవ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. కొరటాల శివ గత చిత్రం ఆచార్య అట్టర్ ప్లాప్ కావడంతో, ఎలాగైనా మళ్ళీ హిట్ సినిమా తీసి పరువును కాపాడుకోవాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను “దేవర” గా నిర్ణయించినట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఈ టైటిల్ పై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఈ టైటిల్ అంతగా క్యాచీ గా లేదని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇదే ఫైనల్ టైటిల్ లేదా మరేదైనా ఉందన్న అన్న విషయం చిత్ర బృందం ఆఫీసియల్ గా ప్రకటిస్తే కానీ తెలియదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని టైటిల్ ను అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news