దిల్లీలో రాష్ట్రపతి భవన్​పై దాడికి కుట్ర​!.. అప్రమత్తమైన పోలీసులు

-

ఓవైపు దేశ రాజధాని దిల్లీలో ప్రతిష్ఠాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంటే.. మరోవైపు ఉగ్రదాడి కుట్ర బయటపడటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలను పటిష్ఠం చేశారు.

బిహార్​కు చెందిన బన్సీ ఝా అనే వ్యక్తి.. పాకిస్థాన్​కు గూడఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్‌కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) డిటెక్టివ్‌లు.. బిహార్​కు వెళ్లి అతడిని అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. దిల్లీ, కోల్​కతా, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన చిత్రాలను తీసి అతడి పాకిస్థాన్​కు పంపినట్లు గుర్తించారు. దేశంలో పలు ముఖ్యమైన ప్రదేశాలను.. ఐసిస్​ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news