రాహుల్‌ను ప్రధాని చేయాలని పాకిస్థాన్ తహతహ : ప్రధాని మోదీ

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువరాజును భారతదేశ ప్రధానమంత్రిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోందని ఆరోపించారు. ఇందుకోసం పాక్ నేతలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పాక్‌కు అభిమాని అనే విషయం అందరికీ తెలుసని, ఆ రెండింటి మధ్యనున్న భాగస్వామ్యం ఇప్పుడు బయటపడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఇటీవల పలువురు పాక్ నేతలు పెట్టిన సోషల్ మీడియా పోస్టులను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆనంద్, ఖేడా లోక్‌సభ స్థానాల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సెంట్రల్ గుజరాత్‌లోని ఆనంద్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ .. భారత్‌లో బలహీన సర్కారు ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారని అన్నారు. 26/11 ముంబయి దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని వాళ్లు ఆశపడుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news