బ్రేకింగ్: ఇండియాలో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి

-

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారతదేశం లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి లభించింది. 2/3 దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి హైదరాబాద్ డాక్టర్ రెడ్డి ల్యాబ్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. ఎక్కువ డోసులను ఉత్పత్తి చేయడానికి గానూ డాక్టర్ రెడ్డీస్ ని రష్యా సంప్రదించి ఒప్పందం చేసుకుంది.

కాగా మన దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ లు సిద్దమవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఒక ప్రకటనలో చెప్పారు. రష్యాలో వ్యాక్సిన్ ని ఇప్పటికే ప్రజలకు పంపిణీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ వ్యాక్సిన్ సామర్ధ్యంపై మాత్రం ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news