ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు పిజ్జాల స‌ర‌ఫ‌రా.. నెటిజ‌న్ల ఆగ్ర‌హం..

-

హ‌ర్యానా, పంజాబ్‌ల‌తోపాటు ప‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన రైతులు గ‌త కొద్ది రోజులుగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేలాదిమంది రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. కేంద్రం కొత్త‌గా అమ‌లులోకి తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రైతు సంఘాల ప్ర‌తినిధులు ప‌లుమార్లు కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా విఫ‌లం అయ్యాయి.

Pizza supply to agitating farmers in Delhi .. Netizens outraged ..

అయితే ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు ఆహారం అందించ‌డం కోసం, వారి ఆరోగ్యం కోసం ఎన్‌జీవోలు ప‌నిచేస్తున్నాయి. రైతుల‌కు ఆహారాన్ని అందించేందుకు గాను ఆందోళ‌న‌లు చేసే ప్రాంతం వ‌ద్ద రోటీ మేకింగ్ మెషిన్‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు. దాంతో గంట‌కు సుమారుగా 1500 నుంచి 2000 వ‌ర‌కు రొట్టెల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక ఖాల్సా ఎయిడ్ సంస్థ ఆధ్వ‌ర్యంలో రైతుల కోసం 25 ఫుట్ మ‌సాజ్ యంత్రాల‌ను ఏర్పాటు చేశారు.

కాగా ప్ర‌స్తుతం భార‌తీయ కిసాన్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో రైతుల‌కు పిజ్జాల‌ను స‌ప్లై చేస్తున్నారు. అందుకు గాను పిజ్జా త‌యారీ మెషిన్‌ల‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ విష‌యంపై కొంద‌రు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వారు ఆందోళ‌న‌లు చేస్తున్నారా ? లేక ఎంజాయ్ చేస్తున్నారా ? బ‌హుశా ఇవి నూత‌న త‌ర‌హా ఆందోళ‌న‌లు కావ‌చ్చు, ఆందోళ‌న‌లు ఇలాగే చేయాలేమో, మొద‌ట బిర్యానీ, ఇప్పుడు పిజ్జా.. త‌రువాత ఏమిటి ? అంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news