. తనకు ప్రాణహాని ఉందన్న పవన్ కళ్యాణ్
. 2019లో సుపారీ గ్యాంగ్‌లు రంగంలోకి దిగాయని వ్యాఖ్య
. ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం
వారాహి యాత్ర ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి అవినీతి,అక్రమాలు పెరిగిపోయాయాని ఆరోపిస్తున్న పవన్. . . సీఎం జగన్ లాగా తనకు కూడా ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్ధిస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. ఏకవచన పదజాలంతో వైసీపీ నేతలను దూషించిన పవన్….తనకు ఒక్క అవకాశం ఇస్తే అక్రమార్కుల తోలు తీస్తానని…హెచ్చరించారు.పదేళ్ళపాటు అధికారానికి దూరంగా పార్టీని నడపడం అత్యంత కష్టమని వ్యాఖ్యానించారు.అందుకే సినిమాలు చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.ఏది ఎలా ఉన్నా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు 2019లో సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారని ఆరోపించారు.అధికారం పోతుందనే భావననే నాయకులతో ఇలాంటి పనులు చేయిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం కాపాడుకునేందుకు నాయకులు ఎంతకైనా తెగిస్తారనేందుకు ఇద ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. అధికారం కోసం ఇంత కృూరంగా రాజకీయ నాయకులు ఆలోచిస్తారని పవన్ వ్యాఖ్యానించారు. తనను చంపేందుకు కూడా సుపారీ గ్యాంగులను రంగంలోకి దించినట్లు ఆనాడు ఇంటిలిజెన్స్ హెచ్చరించిదని తెలియజేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్. . . అలాంటి క్రూర మనస్తత్వం తనకు లేదని స్పష్టం చేశారు.
పవన్ తాజా వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.ఇన్నాళ్ళూ సుపారీ గ్యాంగ్ విషయం పవన్‌కి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రధానంగా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసమే పవన్ ఇలా మాట్లాడారని,ఆయనకు సీఎం అయ్యే కనీస అర్హత లేదని చెప్తున్నారు.అధికారం దక్కలేదన్న నిరాశలో పవన్ అలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. పవన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా 2024లో అధికారం దక్కడం కలేనని వ్యాఖ్యానిస్తున్నారు.