ఈ శతాబ్దం.. ఆసియా శకం. ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందున 10 దేశాల ఆసియాన్ కూటమి ఓ వృద్ధి కేంద్రం. భారత్ ‘ఇండో-పసిఫిక్ ఇనిషియేటివ్’లో ఏసియన్ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. భారత్ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి మూల స్తంభం. ఆసియాన్ కేంద్రీయతకు, ఇండో- పసిఫిక్‌పై దాని వైఖరికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఆసియాలోని ‘తైమూర్-లెస్టే’ దేశంలో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఇండోనేషియా రాజధాని జకర్తాలో పర్యటిస్తున్న మోదీ.. అక్కడ నిర్వహించిన ఆసియాన్- భారత్ సదస్సులో పాల్గొన్నారు. దాంతో పాటు తూర్పు ఆసియా సదస్సు లో పాల్గొని మోదీ ప్రసంగించారు. నియమాల ఆధారిత కొవిడ్ అనంతర ప్రపంచ క్రమాన్ని నిర్మించాలని పిలుపునిస్తూ.. స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్ పురోగతి, ‘గ్లోబల్ సౌత్’ గొంతుకను పెంచడం అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసమేనని మోదీ వ్యాఖ్యానించారు.