అయోధ్య భూమి పూజ చేసిన ప్రధాని…!

-

రామ మందిరం భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్య నాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు. రామ నామస్మరణతో అయోధ్య మార్మోగుతుంది. పెద్ద ఎత్తున లౌడ్ స్పీకర్ లు ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. వేద పండితుల మంత్రాలతో ఆ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

విపత్తులను తట్టుకుని నిలిచే విధంగా నిర్మాణం చేపడుతున్నారు. ఒకేసారి పది వేల మంది దర్శించుకునే విధంగా నిర్మాణం ఉంటుంది. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు. 5 ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని హోదాలో తొలిసారి ఆయన అయోధ్యకు వచ్చారు. భూమి పూజకు ముందు ప్రధాని హనుమాన్ ఘడీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news