మహిళల మంగళ సూత్రాలపై కాంగ్రెస్ నేతల కన్ను.. మరోసారి మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోదీ. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రజల సంపాదన, ఆస్తులపై కన్నేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహిళల మంగళసూత్రాలపై వారి దృష్టి పడిందని, ఇండియా కూటమి నేతలు వాటిని దొంగలించేందుకు చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ప్రజల ఆస్తులపై సర్వే నిర్వహించి వాటిని అందరికీ పంచేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని మోదీ విమర్శించారు. తాను చివరిసారి అలీఘడ్కు వచ్చినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ బంధుప్రీతి, అవినీతి బుజ్జగింపుల ఫ్యాక్టరీకి తాళం వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశానని, తన రిక్వెస్టును ఆమోదించి ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మీ నిర్ణయంతోనే యువరాజులు (రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి) ఇద్దరూ ఆ ఫ్యాక్టరీ తాళం చెవిని పొందలేకపోయారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం కోసం మళ్లీ ఇక్కడికి వచ్చానంటూ.. తమ పార్టీని, తనను ఆశీర్వదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news