జర్మనీ వెళ్లిన ప్రధాని మోదీ… మూడు రోజుల పాటు 3 దేశాల్లో పర్యటన

-

చాలా రోజలు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ప్రధాని జర్మనీ బయలుదేరారు. జర్మనీతో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. సోమవారం జర్మనీలో  వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జర్మనీ- ఇండియా మధ్య సహకారాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి రెండు దేశాల మధ్య చర్యలు జరుగనున్నాయి. 6వ ఇండియా – జర్మనీ గవర్నమెంటల్ కన్సల్టేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు జర్మనీ ఛాన్స్ లర్ ఓల్ఫ్ స్కోజ్ పాల్గొననున్నారు. మంగళవారం డెన్మార్ దేశంలో పర్యటించనున్నారు మోదీ. నార్డిక్ దేశాల నేతలతో సమావేశం కానున్నారు. బుధవారం ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. పారిస్ లో కొత్తగా మరోసారి ఎన్నికైన ఫ్రాన్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్ తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింగా పెంపొందించుకునే విధంగా చర్చలు జరుగనున్నాయి. మూడు దేశాలతో భాగస్వామ్యాన్ని  మరింతగా పెంచుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్త పరిణామాలపై కూడా చర్చించున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news