నేడు సీఎంల‌తో పీఎం మోడీ స‌మావేశం.. లాక్ డౌన్ పై కీలక నిర్ణ‌యం!

-

దేశంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్నాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌మావేశం కానున్నారు. అన్ని రాష్ట్రాల‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప‌రిస్థితుల గురించి తెలుసుకోనున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ రోజు సాయంత్రం 4:30 గంట‌ల ఈ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పీఎం మోడీ స‌మావేశం కానున్నారు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు, మంత్రుల‌కు, కేంద్ర మంత్రుల‌కు, సెల‌బ్రెటీల‌కు క‌రోఓనా సోకింది. ఈ సంఖ్య భ‌విష్య‌త్తులో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు కూడా హెచ్చ‌రిస్తున్నారు. కాగ‌ ఇప్ప‌టి కొన్ని రాష్ట్రాల‌లో క‌ఠిన ఆంక్షల‌ను కూడా అమలు చేస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అనే ఉత్కంఠ కూడా నెల‌కొంది. ఈ సంద‌ర్భంలో ఈ స‌మావేశం కీల‌కం కానుంది.

 

ఈ స‌మావేశంలో లాక్ డౌన్ లేదా దేశ వ్యాప్తంగా నైట్ క‌ర్ఫ్యూ లేదా క‌ఠిన ఆంక్ష‌లు విధించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అయితే లాక్ డౌన్ విధిస్తే.. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా మ‌రింత వెన‌క ప‌డే ప్ర‌మాదం ఉన్న నేప‌థ్యంలో నైట్ క‌ర్ఫ్యూ తో పాటు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news