రాష్ట్ర శాస‌నమండ‌లి ప్రొటెం చైర్మెన్‌గా అమీనుల్ హ‌స‌న్

-

తెలంగాణ రాష్ట్ర శాస‌నమండ‌లి ప్రొటెం చైర్మెన్ గా ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ నియ‌మించారు. ప్రొటెం చైర్మెన్ గా ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీని నియ‌మ‌కాన్ని తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై కూడా ఆమోదించారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తో అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ తెలంగాణ రాష్ట్ర శాస‌న మండ‌లికి ప్రొటెం చైర్మెన్ గా ఎంపిక అయ్యారు. అయితే రాష్ట్ర శాస‌న మండ‌లికి చైర్మెన్ గా ఎన్నుకునే వ‌ర‌కు అమీనుల్ హ‌సన్ జాఫ్రీ ప్రొటెం చైర్మెన్ గా బాధ్య‌తలు నిర్వ‌హిస్తాడు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర శాస‌న మండ‌లి చైర్మెన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, వైస్ చైర్మెన్ గా నేతి విద్య సాగ‌ర్ రావు ఉండేవారు. అయితే ఇద్ద‌రు గ‌త కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం ముగిసింది. దీంతో బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. వీరి ప‌ద‌వీ కాలం గ‌త ఏడాది జూన్ లోనే ముగిసింది. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఇప్పటి వ‌ర‌కు ప్రొటెం చైర్మెన్ గా వ్య‌వ‌హరించారు. అయితే ఇటీవ‌ల భూపాల్ రెడ్డి ప‌ద‌వీ కాలం కూడా ముగిసింది. దీంతో కొత్త ప్రొటెం చైర్మెన్ ఎన్నుకున్నారు. కాగ త్వ‌ర‌లోనే శాస‌న మండ‌లికి కొత్త చైర్మెన్ ఎన్నుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news