ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్య ఆరోపణలపై తొలిసారి స్పందించిన మోదీ

-

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు అమెరికాలో జరిగిన కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ఉన్నారనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాత్రమే స్పందించారు. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి నోరు విప్పారు.

ఈ కేసుకు సంబంధించి అలాంటి సమాచారం ఏదైనా తమకు అందిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని మోదీ తెలిపారు. పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే దాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. ఇలాంటి కొన్ని ఘటనలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.

ఇతర దేశాల్లో భారత పౌరులు ఏదైనా తప్పు చేసినట్లు సమాచారం వస్తే దానికి తగిన ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం ఉంటుందని మోదీ వివరించారు. చట్టానికి లోబడి పాలన చేసేందుకు తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే భారత్కు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద గ్రూపులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇలాంటివి చాలా ప్రమాదకరం, ఆందోళనకరం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news