Bengal train accident: రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోడీ స్పందించారు. బెంగాల్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అక్కడికి బయలుదేరినట్లు చెప్పారు. అటు బెంగాల్ రైలు ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయిగుడిలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 15 మంది చనిపోయినట్లు డార్జిలింగ్ ASP అభిషేక్ రాయ్ వెల్లడించారు. 20-25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంచన్జంఘా ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ ఢీ కొట్టినట్లు ఆయన చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..