పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోడీ

-

పీఎం కిసాన్ 20వ విడుత  నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగిన బహిరంగ సభలో రూ.20వేల కోట్లకు పైగా నిధులు రిలీజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ అయ్యాయి. 9.7కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అనంతరం ప్రధాని మోడీ సమావేశంలో మాట్లాడారు.

pm modi

ఆపరేషన్ సిందూర్ తరువాత తాను మొదటిసారిగా వారణాసికి వచ్చానని.. 2,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అర్హులైన ప్రతీ రైతుకు పీఎం కిసాన్ నిధులు అందుతాయని తెలిపారు. దేశంలో చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతీ ఏటా 6వేల రూపాయలు వాయిదాల పద్దతిలో నేరు వారి ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి జమ అయినట్టు తెలుస్తోంది.  మరోవైపు ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో బిగ్ స్క్రీన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news